ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh) రాజధాని అమరావతిలో(amaravathi) ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై(House Constructions) హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh) రాజధాని అమరావతిలో(amaravathi) ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై(House Constructions) హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటీష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన‌ జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఈ తీర్పు వెలువరించింది.

అమరావతిలో రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విష‌య‌మై ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టును సంప్ర‌దించాయి.

Updated On 3 Aug 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story