కృష్ణా జిల్లా(Krishna District) మొగల్రాజపురంలో అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ను(Ambedkar Community Hall) ఆక్రమించి సచివాలయానని(Sachivalayam) నిర్వహిస్తున్న అధికారులకు ఏపీ హైకోర్టు(AP high Court) షాకిచ్చింది. అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ భవనాన్ని ఆక్రమించి గ్రామ సచివాలయాన్ని నడుపుతున్నారంటూ మొగల్రాజపురానికి చెందిన పరసా సుమన్‌(Parasa Suman) హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు.

కృష్ణా జిల్లా(Krishna District) మొగల్రాజపురంలో అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ను(Ambedkar Community Hall) ఆక్రమించి సచివాలయానని(Sachivalayam) నిర్వహిస్తున్న అధికారులకు ఏపీ హైకోర్టు(AP high Court) షాకిచ్చింది. అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ భవనాన్ని ఆక్రమించి గ్రామ సచివాలయాన్ని నడుపుతున్నారంటూ మొగల్రాజపురానికి(Mughal Rajpura) చెందిన పరసా సుమన్‌(Parasa Suman) హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌(Jada Shravankumar) దళితుల ప్రయోజనార్థం నిర్మించిన కమ్యూనిటీ భవనాలలో ప్రభుత్వ ఆఫీసులు నిర్వహించటం జోవీ ఎంఎస్‌ నంబర్‌ 35కు విరుద్ధమని అన్నారు. దళితులకు, గిరిజనులకు కేటాయించిన భవనాలలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలు నడపటం చట్టవిరుద్దమని జడా శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. తక్షణమే ఈ భవనాలను ఖాళీ చేసి అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ యాజమాన్యానికి అప్పగించాలన్నారు. జడా శ్రవణ్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వచ్చే రెండు నెలలలో ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి కమ్యూనిటీ భవనాన్ని కమిటీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రెండు నెలల్లోపు భవనాన్ని ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

Updated On 29 Nov 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story