YSR Law Nestham : గుడ్న్యూస్.. నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు..!
వైఎస్సార్ లా నేస్తం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున జులై-డిసెంబర్(6 నెలలు) కాలానికి గానూ ఒక్కొక్కరికి రూ. 30,000 ఇస్తూ..

Andhra Pradesh government to release second tranche of YSR Law Nestham on December 11
వైఎస్సార్ లా నేస్తం(YSR Law Nestham) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల(Junior Lawyers)కు నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున జులై-డిసెంబర్(6 నెలలు) కాలానికి గానూ ఒక్కొక్కరికి రూ. 30,000 ఇస్తూ.. మొత్తం రూ. 7,98,95,000 ను నేడు సీఎం జగన్(CM Jagan) క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్(Law Graduation) పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం. మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ ను ప్రభుత్వం అందిస్తుంది. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకూ 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు అని ప్రకటనలో పేర్కొంది.
పథకానికి అప్లై చేసుకోదలిచిన వారు https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్(Website) లో తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్(Bank Account), ఆధార్ నంబర్(Adhaar Number) ను పొందుపరిచి సర్టిఫికెట్స్(Certificate) అప్లోడ్ చేయాలి.
