ఈ నెల 22వ తేదీన ఎలోన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) రాష్ట్రంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా'ను ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి టెస్లాను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే కంపెనీకి రెండు ఇమెయిల్‌లు పంపినట్లు ఏపీ అధికారులు ధృవీకరించారు. పారిశ్రామిక అవసరాల కోసం అవసరమైన భూమి లభ్యతను టెస్లా ప్రతినిధి బృందానికి ప్రభుత్వం అందించింది. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్ సమీపంలో పుష్కలంగా భూమి అందుబాటులో ఉందని.. ఈ ప్రదేశం బెంగుళూరు, చెన్నై, కృష్ణపట్నం ఓడరేవుకు వ్యూహాత్మకంగా దగ్గరగా ఉందని తెలిపింది. టెస్లా పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైతే.. ప్రైవేట్ వ్యక్తుల నుండి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని తెలిపింది. టెస్లా ప్లాంట్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశాయి.

ఈ నెల 22వ తేదీన ఎలోన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. టెస్లా CEO ఎలోన్ మస్క్ భారతదేశ పర్యటన దాదాపు 48 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో బిలియనీర్ మెగా ప్రకటనలు చేయనున్నారు. భారతదేశంలో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏప్రిల్ 21- 22 తేదీల్లో మస్క్ భారతదేశంలో ఉంటారని CNBC-TV18 నివేదించింది. టెస్లా CEO ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు పరిశ్రమ ప్రతినిధులను కలుస్తారు.

Updated On 12 April 2024 10:07 PM GMT
Yagnik

Yagnik

Next Story