Liquor Rates : మందుబాబులకు అలర్ట్.. ధరలు చెక్ చేసుకోండి.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను మరోసారి పెంచింది. పన్నుల సవరణ పేరిట క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మద్యం ధరల(Liquor Rates)ను మరోసారి పెంచింది. పన్నుల సవరణ పేరిట క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ(Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే కొన్ని మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గడం విశేషం. వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ(MRP) ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్నఏఆర్‌ఈటీని ( అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని ).. ఇకపైన ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. ఇందుకోసం వ్యాట్, ఏఈడీనీ సవరించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.
డిమాండ్ ఎక్కువగా ఉన్న పలు బ్రాండ్ల క్వార్టర్‌పై రూ.10-40 వరకూ, హాఫ్ బాటిల్‌పై రూ.10-50 వరకూ, ఫుల్ బాటిల్ రూ.10-90 వరకూ పెరిగాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉదాహరణకు ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి చేరింది. అయితే కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గాయి.