Dasara Holidays In Andhra Pradesh : ఆంధప్రదేశ్‌లో 14 నుంచి 23 వరకు దసరా సెలవులు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం అక్టోబర్ 14 నుంచి 23 వరకు పాఠశాలలకు(School) దసరా సెలవులు(Dasara Holidays) ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత 25 నుంచి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం అక్టోబర్ 14 నుంచి 23 వరకు పాఠశాలలకు(School) దసరా సెలవులు(Dasara Holidays) ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత 25 నుంచి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 3వ తేదీ నుంచి నుంచి 6వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FAT-2) పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది.