AP Budget : వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా...!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను(Annual Budget) ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2.34 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు 68, 743 కోట్ల రూపాయలు, రెవెన్యూలోటు 34, 743 కోట్ల రూపాయలుగా ఉంది. బడ్జెట్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalayn) శాఖలకు భారీగా కేటాయింపులు ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్ల రూపాయలు కేటాయించారు. అటవీ పర్యావరణ(Forest environment department) శాఖకు 687 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక జలవనరులకు 16,705 కోట్లు,ఉన్నత విద్యకు(Current electricity) 2,326 కోట్లు, పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు 3,127 కోట్లు, ఇంధనరంగానికి 8,207 కోట్లు, పోలీసుశాఖకు 8,495 కోట్లు, బీసీ సంక్షేమానికి 3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు, అటవీ పర్యావరణశాఖకు 687 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు(School and Education) 29,909 కోట్లు, మహిళ, శిశు సంక్షేమం 4,285 కోట్లు, మానవ వనరుల అభివృద్ధి 1,215 కోట్లు కేటాయించారు.
🔴Live : AP Assembly Sessions 2024 : అసెంబ్లీ సమావేశాలు Day-1 | AP Assembly Budget Sessions | Eha TV