తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావే చెబుతున్నా

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావే(TTD EO Syamala Rao) చెబుతున్నా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) మాత్రం ప్రాయశ్చిత్త దీక్షను వదలడం లేదు. దీక్షలో భాగంగానే అక్టోబర్‌ 1, 2వ తేదీలలో తిరుమలకు వెళుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకునే పవన్‌ కల్యాణ్‌ అక్కడి నుంచి నేరుగా అలిపిరి దగ్గర ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించి తర్వాత మెట్ల మార్గంలో తిరుమల(Tirumala)కొండ ఎక్కబోతున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అటు పిమ్మట టీటీడీ(TTD) అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.

ehatv

ehatv

Next Story