AP Congress : ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun kherge) అధ్యక్షతన బుధవారం ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి(Raghuveera reddy), సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చ జరిగింది.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun kharge) అధ్యక్షతన బుధవారం ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి(Raghuveera reddy), సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చ జరిగింది. అలాగే, ఏపీ కాంగ్రెస్ యాక్టీవిటీ రిపోర్టును రుద్రరాజు అధిష్టానానికి అందించారు. పీసీసీగా ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలతో 700 పేజీల యాక్టీవిటీ రిపోర్ట్‌ను రుద్రరాజు సిద్ధం చేశారు. ఇక, జనవరిలో ఏపీలో మూడు సభల కోసం ఖర్గే, రాహుల్, ప్రియాంకను రుద్రరాజు ఆహ్వానించారు. హిందూపురంలో(Hindupur) ఖర్గే, విశాఖలో(Vishaka) రాహుల్, అమరావతిలో(Amaravathi) ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.