ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 11వ తేదీ పులివెందులలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 11వ తేదీ పులివెందులలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ప్రారంభించే వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాల, కళాశాలలోని భవనాలను అధికారులు పరిశీలించారు. బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌, మినీ సెక్రటేరియట్‌ భవనాన్ని, వైఎస్సార్‌ సర్కిల్‌ బోలేవార్డు షాపింగ్‌ కాంప్లెక్స్‌ గాంధీ సర్కిల్‌, ఉలిమెల్ల లే క్‌ ఫ్రంట్‌, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్‌ లిమిటెడ్‌ ఇండస్ట్రీని, సంయుగ్లాస్‌ ఇండస్ట్రీని అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్‌ కౌశల్‌ పోలీసులకు సూచించారు.కడప ఎయిర్‌ పోర్టు, పులివెందుల హెలీప్యాడ్‌, ప్రారంభోత్సవాలు జరిగే ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

పులివెందుల నియోజకవర్గంలో రూ.861.84కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. పులివెందులలో నిర్మించిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను సైతం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్‌ 24న శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ టెక్స్‌టైల్స్‌, బ్రాండెడ్‌ గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఏటా 24లక్షల గార్మెంట్స్‌ తయారీ సామర్థంతో నెలకొల్పిన ఈ యూనిట్‌లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కలగనుంది. ఇడుపులపాయ కేంద్రంగా రూ.39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పులివెందుల సమీపంలో రూ.66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్‌ను ప్రారంభించనున్నారు. మ్యూజికల్‌ లేజర్‌ ఫౌంటేన్‌, కిడ్స్‌ప్లే ఏరియా తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్‌ హౌస్‌ను ప్రారంభించనున్నారు.

Updated On 10 March 2024 10:17 PM GMT
Yagnik

Yagnik

Next Story