ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh)కురుస్తున్న భారీ వర్షాలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh)కురుస్తున్న భారీ వర్షాలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఎక్కడ చూసినా వరద నీరే. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CM Chandra Babu Naidu)అక్రమ నివాసాన్ని కూడా వరద ముంచెత్తింది.

ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని.. రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని చంద్రబాబునాయుడుకు జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. దాంతో చంద్రబాబు విజయవాడ(Vijayawada)లోని ఎన్టీఆర్‌ జిల్లా (Ntr District)కలెక్టర్‌ కార్యాలయంలో బస చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌(prakasam barrage)లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటు 35 నివాసాలను వరద చుట్టు ముట్టింది. ఇందులో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌(Nara Lokesh) గెస్ట్‌ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా జలవనరుల అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2019లో ఆగస్టు 14వ తేదీ నుంచి నుంచి 17వ తేదీ వరకు వరకూ కృష్ణా నది(Krishna River)కి భారీ వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతోపాటూ 35 అక్రమ బంగ్లాలు నీట మునిగాయి. 2020, 2021, 2022లోనూ ఇదే జరిగింది. అప్పుడు విపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు.

ehatv

ehatv

Next Story