Chandrababu : జగన్‌ను ఎస్కోబార్‌తో పోల్చిన చంద్రబాబు.. అసలు ఎవరీ ఎస్కోబార్?
అసెంబ్లీలో(asembly) నిన్న శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సమయంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో(asembly) నిన్న శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సమయంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్(YS Jagan) హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హత్యలు, అత్యాచారాలు, దాడులు పేట్రేగిపోయాయని ఆయన విమర్శించారు. దేశంలో గంజాయి ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తయారుచేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించాడని అన్నారు. అంతేకాదు జగన్ ఏస్కోబార్(Escobar) లాంటోడని చంద్రబాబు(Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరీ ఎస్కోబార్.. అతను ఏంచేసేవాడో తెలుసుకుందాం.
పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు ఆదాయ సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు. దీంతో అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడిగా ఉండేవాడు. కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి కాకుండానే వచ్చాడు.
క్రమేపి బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనంలోనూ పాల్గొన్నాడు. 1970ల్లో పలువురు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు. ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్‌లో తొలి అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరిచి, పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్‌కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి అమెరికాకు రవాణా చేసేవాడని అంచనా. అతని డ్రగ్ నెట్‌వర్కును అది పుట్టిన నగరం పేరు మీదుగా మెడెలిన్ కార్టెల్ అని పిలుస్తారు. ఈ మెడెలిన్ కార్టెల్‌కి దాని పోటీ కార్టెల్‌లతో జాతీయంగా, అంతర్జాతీయంగా స్పర్థ ఉండేది. దాని కారణంగా హత్యాకాండకు పాల్పడేవారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు చేసేవారు.
ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా, కొలంబియా ప్రపంచ హత్యల రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. 1993లో ఎస్కోబార్‌ని అతని 44వ పుట్టినరోజు అయిన ఒకరోజు తర్వాత కొలంబియన్ నేషనల్ పోలీసులు అతనిని కాల్చిచంపారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఈ ఎస్కోబార్‌తో జగన్‌ను పోల్చారు. జగన్‌పై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చ తలెత్తింది.