సీఎం వైఎస్ జ‌గ‌న్(YS Jagan) గురువారం నాడు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు.. మరో మూడు కంపెనీల(company) నిర్మాణ పనులకు క్యాంపుకార్యాలయం నుంచి వర్చువల్‌గా(Virtual) శంకుస్ధాపన చేశారు. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్(Cribco Green Energy Pvt), విశ్వసముద్ర బయో ఎనర్జీ(Respiratory bioenergy), సీసీఎల్‌ ఫుడ్ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు(CCL for food and beverages industries) వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేశారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్(YS Jagan) గురువారం నాడు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు.. మరో మూడు కంపెనీల(company) నిర్మాణ పనులకు క్యాంపుకార్యాలయం నుంచి వర్చువల్‌గా(Virtual) శంకుస్ధాపన చేశారు. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్(Cribco Green Energy Pvt), విశ్వసముద్ర బయో ఎనర్జీ(Respiratory bioenergy), సీసీఎల్‌ ఫుడ్ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు(CCL for food and beverages industries) వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేశారు. అనంత‌రం గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు(emplyoment) లభిస్తాయని తెలిపారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభించాం. ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయ‌ని పేర్కొన్నారు. నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్లాంట్‌ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

నెల్లూరు జిల్లాలోనే రూ.315 కోట్లతో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ వస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్‌ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివ‌రించారు.

అలాగే.. ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధ రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్‌ వల్ల 500 మందికి ఉద్యోగ ఉఫాధి అవకాశాలు ల‌భిస్తాయని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Updated On 22 Jun 2023 5:46 AM GMT
Ehatv

Ehatv

Next Story