AP Assembly Sessions : 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ(Assembly), 10 గంటలకు శాసన మండలి(Legislative Council) సమాశాలు మొదలవ్వనున్నాయి. అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees) క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 20న సీఎం వైఎస్ జగన్(CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ(Cabinate) జరుగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలి చర్చించనుంది.