AP Assembly : అసెంబ్లీలో గందరగోళం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(AP Assembly) ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చిన టీడీపీ(TDP) సభ్యులు సభా ప్రారంభం నుంచే నిరసన చేపట్టారు. చంద్రబాబు అరెస్టు(Chandrababu) అక్రమమని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.
టీడీపీ సభ్యుల వైఖరిని వైసీపీ సభ్యులు తప్పుబట్టారు. స్పీకర్, వైసీపీ సభ్యులు వారిస్తున్నా వినకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేశారు. హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) అసెంబ్లీలో మీసం తిప్పారు. మంత్రి అంబటి రాంబాబు(Ambati Ramababu) దమ్ముంటే రా అంటూ.. బాలకృష్ణకు సవాల్ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy) కూడా బాలకృష్ణ చర్యలకు స్పందిస్తూ.. సభలో తొడ కొట్టారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ(TDP), వైసీపీ(YCP) సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.