EVM Tapping : జగన్ ఓటమిపై ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(AP elections 2024) ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YCP) ఇంతటి ఘోర పరాజయమేమిటా అని నివ్వెరపోతున్నారు మెజారిటీ ప్రజలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. నాలుగు లోక్‌సభ స్థానాలు వచ్చాయంటే ఆ లెక్కన కనీసం 20 అసెంబ్లీ స్థానాలైనా రావాలి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(AP elections 2024) ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YCP) ఇంతటి ఘోర పరాజయమేమిటా అని నివ్వెరపోతున్నారు మెజారిటీ ప్రజలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. నాలుగు లోక్‌సభ స్థానాలు వచ్చాయంటే ఆ లెక్కన కనీసం 20 అసెంబ్లీ స్థానాలైనా రావాలి. ఈ విషయం పక్కన పెడితే అసలు ఈ ఫలితాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో(YS Jagan) పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ క్యాడర్ కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఏదో జరిగిందనే భావన వారిలో వ్యక్తమవుతోంది. జగన్ కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తూ అందుకు తగిన ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. ఈవీఎంలను(EVM) ట్యాంపరింగ్ చేశారా? లేక మరేదైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదంటూ చాలా సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఆవేదనలో విమర్శిస్తున్నారు కానీ వారి విమర్శలో వాస్తవం ఉందని అనలేం. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల అభిప్రాయమే కదా కావాల్సింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. జగన్ ఓడితే ఓడిపోవచ్చు గాక, కానీ ఇంత ఘోరంగా ఓడిపోవడమేమిటి? అంత నేరం ఏమి చేశారు? అని ప్రజలు అనుకుంటున్నారు. 2019 ఎన్నికలప్పుడు మేనఫెస్టోలో చెప్పిన వాటిలో దాదాపు 95 శాతం హామీలు ఆమలు చేశారు జగన్. విద్య, వైద్య రంగాలను ఎంతగానో అభివృద్ధి చేశారు. అయినా ఈ రకమైన ఓటమి ఏమిటని అంతర్మథనం చెందుతున్నారు. జగన్‌కు ఓటు వేయని వారు కూడా ఇదే రకమైన భావనలో ఉన్నారు. ఏదో జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. జగన్ వ్యతిరేకుల్లో కూడా అయ్యో పాపం అనే సానుభూతి కనిపిస్తోంది.