Good News: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీలు సమ్మె చేసిన కాలాన్ని విధినిర్వహణలోనే ఉన్నట్లు లెక్కించి జీతాలు వేయనున్నారు. డిసెంబర్ 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకూ మొత్తం 42 రోజుల సమ్మె కాలంలో చెల్లించాల్సిన వేతనాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలోనూ.. మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులు ఎత్తివేస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను(DA) విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఏప్రిల్ జీతంతో కూడిన ఒక డీఏ, జూలై నెల జీతంతో కూడిన మరొక డీఏ అందజేయనుంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1, 2019 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు DA విడుదల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) షంషేర్ సింగ్ రావత్ ప్రభుత్వ ఉత్తర్వు (GO) జారీ చేశారు.