గుంటూరు(Guntur), కృష్ణ(Krishna River)నదిలో కొట్టుకొస్తున్న దేవుని విగ్రహాలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బయటపడిన పదకొండు విగ్రహాలు. సర్రిగ్గా నెల క్రితం కృష్ణ నదిలోనే బయట పడ్డ భారీ నాగ ప్రతిమలు. అచ్చంపేట మండలం అంబడిపూడి వద్ద కృష్ణానదిలో బయటపడ్డ పురాతన దేవతామూర్తుల విగ్రహలు.

గుంటూరు(Guntur), కృష్ణ(Krishna River)నదిలో కొట్టుకొస్తున్న దేవుని విగ్రహాలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బయటపడిన పదకొండు విగ్రహాలు. సర్రిగ్గా నెల క్రితం కృష్ణ నదిలోనే బయట పడ్డ భారీ నాగ ప్రతిమలు. అచ్చంపేట మండలం అంబడిపూడి వద్ద కృష్ణానదిలో బయటపడ్డ పురాతన దేవతామూర్తుల విగ్రహలు. ఇసుక మేటలు తొలగింపు తర్వాత అడుగుభాగంలో విష్ణుమూర్తి,శివలింగం, నందీశ్వరుని రాతివిగ్రహలు గుర్తించిన స్ధానికులు. ఎగువన నుండి నదిలో కొట్టుకువచ్చాయని స్థానికులు అనుమానం. విగ్రహాలు చూసేందుకు తరలివస్తున్న గ్రామస్థులు.

రెండు రోజుల క్రితం స్థానిక రైతులు నదిలోకి వెళ్ళి నీటి ప్రవాహానికి వీలుగా ఇసుక మేటలు తొలగించారు. దీంతో పై నుండి నీటి ప్రవాహం జాలుగా మొదలైంది. రెండు రోజుల్లో నీటి ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలోనే స్థానిక యువకులు నదిలో స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తున్నయువకుల కాళ్లకి రాళ్ళు తగలడంతో వాటిని బైటకి తీసే క్రమంలో మొదట నంది విగ్రహాం కనిపించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. నంది, శివలింగం తో పాటు విష్ణు మూర్తి విగ్రహం, మరో విగ్రహం కూడా బయట పడ్డాయి.

విగ్రహాలు లభించిన చోట ఎలాంటి పురాతన దేవాలయాలు లేవు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయి పదేళ్ళైంది. దీంతో పై నుండి విగ్రహాలు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చే అవకాశం లేదు. పులిచింతల నుండి అంబడపూడి గ్రామం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపధ్యంలో ఈ నలబై కిలోమీటర్లు పరిధిలోనే విగ్రహాలను పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు అంత బరువైన విగ్రహాలు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చే అవకాశం లేదని మరికొంత మంది చెబుతున్నారు. మొత్తం మీద పదకొండు విగ్రహాలు బయట పడటం స్థానికంగా కలకలం రేపింది.

అలా ఒకేసారి ఒకే చోట 11 విగరహాలు లభించడం తో విగ్రహాలు ఎలా వచ్చాయి అనే ప్రశ్న గ్రామస్తుల్లో మొదలైంది. విగరహాలను గమనిస్తే గతంలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆలా పూజలందుకున్న విగరహాలు నదిలోకి ఎలా వచ్చాయి అనే అనుమానం స్థానికుల్లో మొదలయింది. పురాతన దేవాలయాలను తొలగించిన సమయంలో తిరిగి ప్రతిష్టించే అవకాశం లేని వాళ్ళు జలాధివాసం చేసి ఉంటారని అనుకంంటున్నారు. మరోవైపు కృష్ణా నది తీర ప్రాంతంలో గుప్త నిధులు వేటగాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంది. పురాతన ఆలయాల్లో విగ్రహాలను తొలగించి గుప్త నిధుల కోసం వేట సాగిస్తుంటారు. అలా ఏమైనా జరిగిందా అన్న కోణంలోనూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated On 24 July 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story