అసమర్ధ నాయకుల పాలనలో పవిత్రమైన మీ కొండ పై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం

నాడు పుష్కరాలు , నేడు తిరుమల . ఆనాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది . ఈనాడు తిరుమల లొ ఆరుగురూ సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు . 40 మంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు . చంద్రబాబు నాయుడు గారు దీనికి మీ సమాధానం ..., అధికారుల పై మీరు ఆగ్రహం వ్యక్తం చెయ్యడం . మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కాలిగిస్తోంది సర్.!

టీటీడీ ఛైర్మెన్ మీరు నియమించిన అధికారే , ఈఓ మీరు నియమించిన అధికారే , జే ఈ ఓ మీరు నియమించిన అధికారే ....! మీరూ నియమించినా మీ అధికారులకు తెలీదా ? ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని లక్షల మంది స్వామి దర్శనం కోసం వస్తారని , దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలీదా ??? తెలుసు కానీ ఒక నిర్లక్ష్య భావం . అవునా ? కాదా ? జరిగిన దుర్ఘటన చూస్తే అవును అనే అనుకోవాలి .

దేవునితో రాజకీయం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ..? Iam an unapologetic sanathani hindu అని మైక్ లు పగిలిపోయేలా అరిచారు కదా ఆహ్ రోజు . ఇప్పుడు ఎక్కడున్నారు ఎం మాట్లాడరే ???? ఉప ముఖ్యమంత్రి you must apologise all the devotees in tirumala …! You must . It’s high time …!

లేకపోతే మొన్న జరిగిన గేమ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటన కు గత ప్రభుత్వాన్ని భాద్యుల్ని చేసి మీరు ప్రచారం చేసిన అబద్దాల్లాగా , దీన్ని కూడా ఎలా డైవర్ట్ చెయ్యాలా అని ఆలోచనలో బిజీ గ ఉన్నారా ?????

90 కౌంటర్లు వేరు వేరు లోకేషన్స్ లో ఏర్పాటు చేసారు సంతోషం . 5 A.M నుంచీ దర్శనం టికెట్ లు అందుబాటులో ఉంటాయన్నారు ఆనందం .మీరు చెప్పింది విని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చారు .కానీ మీ ఏర్పాట్ల లోపం వల్ల , విష్ణు నివాసం , బైరాగిపట్టెడ, రామచంద్ర పుష్కరిణి వద్ద ఎంత తొక్కిసలాటలు జరిగాయి . దీనికి కచ్చితంగా కారణం మీ వైఫల్యమే ...!

QLINE MANAGEMENT FAILED

ADMINISTRATION FAILED

LAW &ORDER FAILED

G.S.T .FAILED

TOTAL GAA ఈరోజున ఏడుకొండలవాడి సాక్షి గా కూటమి ప్రభుత్వం FAILED.

మా పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు , రోజా గారు చెపినట్టు .బాధిత కుటుంబాలకి కోటి రూపాయలు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము .

మీ ఆగ్రహం వాల్ల , మీ సారీ వల్ల ఏమి ప్రయోజనం లేదు . చివరికి మా పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్ మెహన్ రెడ్డి గారు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు అని తెలిస్తే కానీ మీ పాదం అటు వైపు కదలేదు బాబు గారు . దయచేసి ఈ సహాయం మాత్రం బాధిత కుటుంబాలకి అందించడం లో మాత్రం వైఫల్యం చెందకండి . చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అని కోరుకుంటూ ... !

ehatv

ehatv

Next Story