సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్‌ శ్యామల హాట్‌ టాపిక్‌గా మారారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో యాంకర్‌ శ్యామల హాట్‌ టాపిక్‌గా మారారు. వైఎస్‌ జగన్‌కు మద్దతుగా వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు కూడా వేశారు. ఇవి కాస్త టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్‌ వెన్నంటే ఉన్నారు. జగన్‌(Ys Jagan) కోసం ఆమె పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. వైసీపీ(YCP)లో ఆమెకు జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు.

అయితే యాంకర్ శ్యామల(Anchor Shyamala) పేరుతో ఎక్స్‌లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ యాంకర్‌, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన ట్వీట్ చేసినట్లుగా అందులో ఉంది. 'తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా, పదేపదే అల్లు అర్జున్ గారి అంశాన్ని హైలైట్ చేయడం సరైన విధానం కాదు. ఇప్పుడు వారి ఇంటిపై దాడి జరగడం, ఆ ఘటనను హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదు' అని ఆమె అన్నట్లు ఒక ట్వీట్‌ వచ్చింది. అయితే దీనిపై యాంకర్‌ శ్యామల, వైసీపీ అధికార ప్రతినిధి స్పష్టత ఇచ్చారు. తన అధికారిక వెబ్‌సెట్‌ నుంచి ఎలాంటి ట్వీట్‌ చేయలేదని.. ఎవరో తన పేరుతో ఎక్స్‌ అకౌంట్ క్రియేట్ చేసుకొని తన పేరుతో అలా ట్వీట్‌ చేశారని ఆమె స్పష్టత ఇచ్చారు. తన వర్జినల్ అకౌంట్‌ ఇదే అంటూ ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌ను బహిర్గతపర్చారు. తనకు అధికారిక ట్వీట్‌ నుంచి కాకుండా తన పేరుతో ఇతరత్రా ఎలాంటి హ్యాండిల్స్‌ నుంచి వచ్చిన ట్వీట్స్‌తో తనకు సంబంధంలేదన్నారు. అందరూ ఇది గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ehatv

ehatv

Next Story