యాంకర్ శ్యామల ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి చెప్పిన కథ

యాంకర్ శ్యామల ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి చెప్పిన కథ, అప్పట్లో సోషియల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ కథ శ్యామలకు చాలా మంది శత్రువులను తెచ్చిపెట్టింది కూడా. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన కథపై ట్రోల్స్ మామూలుగా వైరల్ అవలేదు. అదే స్టైల్లో మళ్ళీ ఇప్పుడు ఒక కథ చెప్పింది.

వైసీపీ స్పోక్స్ పర్సన్ అయిన శ్యామల ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక కథ చెప్పింది. ఒక ముసలి వాడు చలికి వణుకుతుంటే.. ఒక వ్యక్తి వచ్చి అతనికి కంబళి ఇస్తా అని ఆశ పెట్టడంతో ఎదురుచూస్తూ.. చలికి వానికి చనిపోయాడని, ఆ తరువాత ఆ వ్యక్తి వచ్చి చూస్తే ఆ ముసలి వాడి చేతిలో ఉత్తరం ఉందని, అందులో మీరు పెట్టిన ఆశ వల్లే తాను చనిపోయానని రాసి ఉందని.. కథ ముగించింది. ప్రభుత్వం కూడా ప్రజలకు హామీల ఆశలు చూపించిందని చెప్పింది.

మంత్రి రామా నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు హామీల గురించిన వీడియో క్లిప్పులు.. నారా లోకేష్ జాబ్స్ గురించిన హామీల వీడియో క్లిప్పులను చూపించి మరీ.. హామీల గురించి ప్రశ్నించారు. హామీలు బాండ్ లాగా చేసి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారు. ఇప్పుడు అవన్నీ మరిచిపోయారు అంటూ లెక్కలతో సహా చూపిస్తూ విమర్శలు చేశారు.

రాష్ట్రం ఆర్థికంగా ఎందుకు వెనకబడింది.. అసలు రాష్ట్రంలో హామీలు ఇచ్చి, కేంద్రం నిధులు ఇస్తే అమలు చేస్తాం అనడం ఏంటని అడిగింది. ఇది కూటమి నేతలకు అలవాటే అని విమర్శించింది. మళ్ళీ జగన్ రావాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని శ్యామల చెప్పింది.

Updated On 4 Jan 2025 9:55 AM GMT
ehatv

ehatv

Next Story