Minister interested in MP seat: ఎంపీ సీటుపై ఆ మంత్రికి ఎందుకంత క్రేజ్ !
మంత్రిగా ఉన్నవారేవరైనా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి..కేబినెట్లో చోటు దక్కించుకోవాలనుకుంటారు. దాని కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఈ మధ్య ఎంపీలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ..ఏపీలో ఓ యువ మంత్రి మాత్రం ఎంపీ కావాలని ముచ్చటపడుతున్నారట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమేగాకుండా కేబినెట్లో కీలకశాఖలు దక్కించున్న ఆ మంత్రి..మనసులో మాటని అధిష్టానం ముందు పెట్టారట. తొలుత డైలమాలోపడిన అధిష్టానం కూడా ఆ ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తోందట. మరి..ఈసారైనా ఆ యువ మంత్రి కోరిక నెరవేరుతుందా?
మంత్రిగా ఉన్నవారేవరైనా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి..కేబినెట్లో చోటు దక్కించుకోవాలనుకుంటారు. దాని కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఈ మధ్య ఎంపీలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ..ఏపీలో ఓ యువ మంత్రి మాత్రం ఎంపీ కావాలని ముచ్చటపడుతున్నారట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమేగాకుండా కేబినెట్లో కీలకశాఖలు దక్కించున్న ఆ మంత్రి..మనసులో మాటని అధిష్టానం ముందు పెట్టారట. తొలుత డైలమాలోపడిన అధిష్టానం కూడా ఆ ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తోందట. మరి..ఈసారైనా ఆ యువ మంత్రి కోరిక నెరవేరుతుందా?
ఈ మధ్య ఎంపీ సీటు వద్దు..ఎమ్మెల్యే సీటు ముద్దు..అంటున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది ఎంపీలు అధిస్టానం దగ్గర మొరపెట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలంతా..ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వప్రతయ్నం చేస్తున్నారు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదింకొకదారి అన్నట్టు.. యువ మంత్రి అమర్నాథ్(Minister Amarnath) మాత్రం దానికి రివర్సలో వచ్చారు. తాతా ఎమ్మెల్యే, తండ్రి మంత్రి..కుటుంబ రాజకీయ వారసత్వాన్ని నిలెబ్టటిన మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) టార్గెట్ ఎంటో తెలుసా!..ఈసారి ఎంపీ(MP)గా పోటీ చేసి గెలుపొందడం. దీంతో మంత్రి అమర్నాథ్ను మారిస్తే.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి(anakapalle) నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి.. క్యాస్ట్ ఈక్వేషన్(caste equations) సీటు మార్చేస్తుందా? గతంలో సామాజిక సమీకరణలు కలిసిరావడంతో 2014లోనే అనకాపల్లి ఎంపీ(anakapalle MP)గా పోటీ చేసినా..అదృష్టం కలిసి రాలేదు. ఆ ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) చేతిలో ఓడిపోవడంతో గుడివాడ కోరిక నెరవేరలేదు. మళ్లీ ఎంపీగా పోటీ చేసి ఎలాగైనా పార్లమెంట్లో అడుగుపెట్టాలని అనుకున్నా..2019లోనూ సమీకరణలు మారడంతో..అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో అమర్నాథ్ గెలవడం..రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో కీలకశాఖలు దక్కించుకోవడం జరిగిపోయాయి. ఇక ఆయన అనకాపల్లి(anakapalle ) ఎమ్మెల్యే అభ్యర్థిగా సెటిల్ అయిపోయారనే అభిప్రాయం అందరిలో ఉంది. మళ్లీ సిట్టింగ్ సీటు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని అంతా భావించారు. మొదట్లో యలమంచిలి(Elamanchili), పెందుర్తి(Pendurthi), గాజువాక(Gajuwaka)నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే మంత్రి నియోజకవర్గం మారితే ప్రతికూల చర్చ జరుగుతుందని భావించిన అధిష్టానం..అనకాపల్లి నుంచి పోటీ చేసేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించిందట. అయితే ఛాన్సు కోసం ఎదురుచూస్తున్న మంత్రి అమర్నాథ్..ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తన మనసులో మాట బయటపెట్టారట. మొదట అంగీకరించపోయినా.. ఆ తర్వాత మంత్రి ప్రతిపాదనను సీరియస్గా పరిశీలించిన అధిష్టానం..ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయం తీసుకుందట.
మరోవైపు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(M.V.V. Satyanarayana).. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్నారట. దీంతో విశాఖ ఎంపీగా ఎవరిని దించాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. అదే సమయంలో అనకాపల్లి ఎంపీ(anakapalle MP)గా ఉన్న సత్యవతి(satyavathi)ని మళ్లీ లోక్ సభకు పోటీ చేయించే ఆలోచన వైసీపీకి లేదట. అక్కడ కూడా అభ్యర్థిని మార్చాలన్న ఆలోచనలో ఉన్న పార్టీకి మంత్రి అమర్నాథ్ బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నారట. రెండు జిల్లాల్లో కూడా బలంగా ఉన్న బీసీ..తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన అమర్నాథ్..ఎక్కడి నుంచి పోటీ చేసినా తిరుగుండదని లెక్కలేసుకుంటోందట వైసీపీ నాయకత్వం. మరి.. మంత్రి అమర్నాథ్ కోరిక ఈసారైనా నెరవేరుతుందా? లేదా అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే !