Professor Wedding Card : అధ్యాపకురాలి పెళ్లి పత్రిక ఇలా ఉంటుందా?
పెళ్లి కార్డులలో(Wedding cards) కూడా క్రియేటివిటిని చూపిస్తున్నారు.
పెళ్లి కార్డులలో(Wedding cards) కూడా క్రియేటివిటిని చూపిస్తున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక మూస పద్దతిలో ఉంటే బాగోదన్నది కొత్తగా ఆలోచించే వారి భావన. ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో టేస్టు! డాక్టర్లు ప్రిస్కిప్షన్ పద్దతిలో పెళ్లి కార్డు కొట్టిస్తారు. లాయర్లు మరొ రకంగా! మరి అధ్యాపకుల(Teacher) సంగతేమిటి? అని అడిగితే అందుకు ప్రత్యూష సమాధానం ఇచ్చారు. అది కూడా తన పెళ్లి కార్డుతో. పశ్చిమ గోదావరి(west godavari) జిల్లా మార్టేరుకు చెందిన ప్రత్యూష ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసెస్టింట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అక్కడే పరిచయమైన ఫణీంద్రతో పెళ్లి కుదిరింది. తన పెళ్లి కార్డు విషయంలో కొంచెం క్రియేటివిటిని జోడించారు. తన వృత్తికి సంబంధించినదిగా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అలా పెళ్లి వివరాలతో ఓ క్వొశ్చన్ పేపర్‌ను(Question Paper) రూపొందించారు. అందులో ప్రశ్న-సమాధానం, స్పెల్లింగ్ సరి చేయడం, తప్పు-ఒప్పు, మల్టిపుల్ కొశ్చన్ ఇలా రకరాల ప్రశ్నలను తయారు చేశారు. వధూవరుల పేర్లు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, ముహూర్త సమయం, కల్యాణ వేదిక, డిన్నర్‌కు సంబంధించిన వివరాలు ఆ ప్రశ్న-జవాబుల్లోనే వచ్చేలా డిజైన్ చేశారు. పెళ్లి కార్డు అందుకున్న వారు ఆమె సృజనాత్మకతకు జేజేలు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డు అందరి ప్రశంసలను అందుకుంటోంది.