ప్రకాశం జిల్లా(prakasham District) గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన అమృత తల్లి తండ్రులు రోజు కూలీలు(laborers). రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. 18 నెలల అమృత తలసేమియా(Thalassemia) తో బాధ పడుతోంది. దీని నివారణకు బోన్ మారో ఆపరేషన్(Bone Marrow Operation) చెయ్యాలని వైద్యులు చెప్పారు.

ఇక్కడ స్క్రీన్ పై కనపడుతున్న ఈ చిన్నారి పేరు అమృత(Amruta). వయసు 18 నెలలు. తన ప్రాణాలని కాపాడుకోడానికి ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తుంది.

ప్రకాశం జిల్లా(prakasham District) గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన అమృత తల్లి తండ్రులు రోజు కూలీలు(laborers). రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. 18 నెలల అమృత తలసేమియా(Thalassemia) తో బాధ పడుతోంది. దీని నివారణకు బోన్ మారో ఆపరేషన్(Bone Marrow Operation) చెయ్యాలని వైద్యులు చెప్పారు.

రోజువారీ కూలీపనులకు వెళ్తే కాని గడవని ఆ కుటుంబానికి కూతురు అమృత వ్యాధి గురించి తెలిసి కన్నీరు మూనీరుగా విలపిస్తున్నారు. డాక్టర్లు చెప్పినట్టు ఆపరేషన్ చెయ్యేలాంటి 22 లక్షలు ఖర్చు అవుతుందని, అంత డబ్బు తమ వద్ద లేదని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ అమృతని కాపాడాలని వేడుకుంటున్నారు.

పుట్టినప్పుడే గుడ్ ప్రాబ్లెమ్ తో పుట్టిన అమృతకి 4 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించామని, ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ చేయించడానికి తమ వద్ద స్తొమత లేదని, దాతలు ముందుకొచ్చి తమ బిడ్డని బ్రతికించాలని వేడుకుంటున్నారు. వైద్య ఖర్చులు కూడా లేని తమకి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలనుకుంటే చిన్నారి తండ్రి రాంబాబు ఫోన్ పే గూగుల్ పే 7093970430 నెంబర్ కి తోచినత ఆర్థిక సహాయం అందించాలనీ తల్లితండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated On 24 July 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story