☰
✕
AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌కు పొంచివున్న తుఫాన్ ముప్పు
By Eha TvPublished on 28 Jun 2024 6:52 AM GMT
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
x
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్(AP) వైపు కదులుతుందని AMD అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం(Vizianagaram), పార్వతీపురం(Parvathipuram), మన్యం(Manyam), విశాఖపట్నం(Vishakapatnam), అల్లూరి(Alluri), కాకినాడ(Kakinada), కోనసీమ(konaseema), తూర్పు గోదావరి(East Godavari), పశ్చిమ గోదావరి(West Godavari), ఏలూరు(Eluru), కృష్ణా(Krishna), ఎన్టీఆర్(NTR), గుంటూరు(Gunturu), బాపట్ల(Bapatla), పల్నాడు(Palnadu), ప్రకాశం(Prakasham) జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Eha Tv
Next Story