Ambati Rambabu Tweet on Pawan kalyan : పవన్ పై అంబటి షాకింగ్ ట్వీట్..
ఈ మధ్య అంబటి తనదైన స్టైల్లో ట్వీట్లతో గిల్లుతున్న విషయం తెలుసు కదా..
ఈ మధ్య అంబటి తనదైన స్టైల్లో ట్వీట్లతో గిల్లుతున్న విషయం తెలుసు కదా.. మళ్ళీ అలాంటి ట్వీటే ఒకటి పోస్ట్ చేసారు అంబటి. పవన్ కళ్యాణ్ పై సెటైర్ వెయ్యడానికి ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తుంటారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఆయనకు గేమ్ చెంజర్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ లో అలాంటి అవకాశం ఒకటి దొరికింది. వెంటనే ఒక ట్వీటు, ట్వీటాడు అంబటి.
పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. హీరోలు వచ్చి మా ముందు చేతులు జోడించుకోవాలని అనుకునేంత కుసంస్కారులం మేము కాదు అని జగన్ ఉద్దేశించి కామెంట్ చేశారు. గత ప్రభుత్వం చిరంజీవిని ఇలా అవమానించారని గుర్తు చేశారు. ఇదే విషయం పై కౌంటర్ గా ట్వీట్ చేసారు రాంబాబు. అంబటి ట్వీట్ మీకోసం..
హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదు
-- పవన్ కళ్యాణ్
తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే
27 రోజులు నోరు విప్పకపోవడం
మీ స్వభావం.
ఇలా రాంబాబు ట్వీట్ చేస్తే, కామెంట్లలో వివేకా హత్యపై జగన్ బిగేవియర్ గురించి విమర్శిస్తున్నారు. యాంటీ వై.సి.పి. కార్య
కర్తలు.