Ambati Rambabu Tweet: గురువు ఆదేశించాడు..శిశ్యుడు పాటించాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. 'గురువు ఆజ్ఞ, శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్టు. ఇది నా మాట కాదు.. ఇది జనం మాట!’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandra babu naidu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అంబటి రాంబాబు(Ambati rambabu) ట్యాగ్ చేశారు. ఐకాన్ స్టార్, పుష్పఫేమ్ అల్లు అర్జున్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు(Nampally Court) 14 రోజుల రిమాండ్ విధించినా.. అల్లు అర్జున్(Allu Arjun) తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పేపర్లలో స్పష్టత లేవని రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ను ఉంచారు. శనివారం ఉదయం 6:45కు చంచల్‌గూడ జైలు బ్యాక్ గేటు నుంచి అతడిని పంపించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుపై అంబటి రాంబాబు ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.