Ambati Rambabu : ప్రజలు చెంపలేసుకుంటున్నారు.. అంబటి రాంబాబు..
విద్యుత్ చార్జీల పెంపు పై పోరుబాట కార్యక్రమంలో అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వై.సి.పి. కరెంటు చార్జీల పెంపును వ్యతిరేఖంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబు పై విమర్శలు గుప్పించాడు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు అని చెప్పారు.
ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసినందుకు చెంపలేసుకుని జగన్ వెంట నడుస్తున్నారు అని రాంబాబు చెప్పారు. రోడ్డుపై టోల్ చార్జీలు వ్యతిరేకంగా నిరసనలు తెలిపితే ఎక్స్టార్షన్ కేసులు పెడుతున్నారు అని అన్నారు. తుపాను కారణంగా ధాన్యం తడిసింది అనే వంకతో రైతుల దగ్గర తక్కువ ధరకు వరి కొనుగోలు చేపట్టారని చెప్పుకొచ్చారు.
స్వయంగా సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోనే ఒక్క లారీ ధాన్యం కూడా 1540 రూపాయలకి కొనుగోలు చేయలేదని, 1300 వందల రూపాయలకే తీసుకుంటున్నారని విమర్శించారు. ఒక వైపు ధాన్యం అమ్మకుంటే వర్షానికి తడిచి పనికి రాకుండపోతుందని రైతులు భయపడి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అంబటి చెప్పారు. ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని ఘాటుగా విమర్శించారు.