టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగిందని అంబటి రాంబాబు అన్నారు.

టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడడం భాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈవో, జెఈవోలు పెద్ద పెద్ద బోర్డ్‌లు కట్టారు.

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి కానీ టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా తన టీవీ ఛానెల్‌లో చేసిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కిందన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఉండి కూడా జగన్‌పై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైఎస్సార్‌సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు.

ehatv

ehatv

Next Story