తెలంగాణలో ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీ పెద్దలకు జరిగిన సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీ పెద్దలకు జరిగిన సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కావటం, పలు సమస్యలపై మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పుష్ప సినిమాలోని సోఫా సీన్‌ను ప్రస్తావిస్తూ.. 'పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే' అంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెల్సిందే. పుష్ప-2 సినిమాలో హీరో తన పనిని పూర్తి చేసుకునేందుకు సోఫాల్లో డబ్బులు పెట్టి పంపించే సీన్ మూవీలోని హైలెట్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో అలాంటి సోఫా వ్యవహారాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రేవంత్‌రెడ్డి, సినీ ప్రముఖుల భేటీని పోల్చుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే ఈరోజు అంబటి రాంబాబు మారో ట్వీట్ చేశారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో తెలుగు క్రీడాకారుడు నితీష్‌ కుమార్‌రెడ్డి భారత జట్టును ఆదుకున్న విషయం తెల్సిందే. రెండో రోజు 164 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును నితీష్‌కుమార్‌రెడ్డి ఆదుకున్నాడు. సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టు పరువును నిలబెట్టాడు. అర్ధసెంచరీ చేసి బ్యాట్‌తో అల్లు అర్జున్‌ను ఇమిటేట్‌ చేశాడు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్ కూడా 50 పరుగులు చేసి నితీష్‌కుమార్‌రెడ్డికి అద్భుతమైన సహకరాన్ని అందించాడు. దీంతో నితీష్‌కుమార్‌రెడ్డి బ్యాట్‌తో తగ్గేదేలా అనేలా పుష్ప సిగ్నేచర్ సీన్‌ను రిపీట్‌ చేశాడు. ఆ వీడియోను జత పరుస్తూ అంబటి రాంబాబు మరోసారి సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు. 'ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న

"పుష్ప"........ హీరోని వేధిస్తూ.. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా ? అంటూ ట్వీట్ చేశారు.

ehatv

ehatv

Next Story