టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని అన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని.. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని అంబటి అన్నారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన […]

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని అన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని.. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని అంబటి అన్నారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లతో వైసీపీ అఖండ విజయం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. తమ టార్గెట్ గెలవటం కాదు.. 175 సీట్లు గెలవటం అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఓడిపోవడమే తమ టార్గెట్ అని అన్నారు. సీఎం జగన్ ను ఓడించడం మీ వల్ల కాదని.. పేద ప్రజానీకం తమకు అండగా ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసినా.. వైసీపీ విజయం ఖామమని అన్నారు.

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు, పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు పార్టీ అధిష్ఠానం నచ్చజెప్పాల్సి ఉంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది.

Updated On 4 Feb 2024 9:21 PM GMT
Yagnik

Yagnik

Next Story