Minister Ambati Rambabu : జైలు నుంచే కుట్రలు చేస్తున్నారు
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై(Chandrababu) మంత్రి అంబటి రాంబాబు(Amabati rambabu) ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Minister Ambati Rambabu
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై(Chandrababu) మంత్రి అంబటి రాంబాబు(Amabati rambabu) ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest) కారణంగా ఆవేదనతో మృతి చెందినవారందరినీ తాను పరామర్శిస్తానని బాలకృష్ణ ముందుగా ప్రకటించారని.. కానీ ఇప్పుడు భువనేశ్వరి(Bhuvaneswari) వెళ్తాననడం ఏమిటన్నారు. ఇది ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ(Balakrishna) పలకరించడం మొదలు పెడితే నారావారి నుంచి పార్టీ పోతుందని భయపడినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
నందమూరి వారి మీద నారావారి కుట్రలు కనిపిస్తున్నాయన్నారు. ఇదివరకు పరామర్శకు వెళ్తానని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. బాలకృష్ణను ఆపేసి.. భువనేశ్వరిని పంపించడం వెనుక కుట్ర ఏం దాగి ఉంది? అని నిలదీశారు. హరికృష్ణను కూడా చంద్రబాబు ఉపయోగించుకున్నారని.. ఆ తర్వాత పక్కన పెట్టారన్నారు. ఇలా నందమూరి కుటుంబాన్ని అవసరానికి ఉపయోగించుకుంటాడని ఆరోపించారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని ప్రచారం చేస్తున్నారని.. కానీ అదంతా వట్టిదే అని ఖండించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. ఆయన ఆరోగ్యం చెడిపోలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని చూపించి ప్రజల్లో సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఇన్ని రోజులుగా కోర్టులలో బెయిల్ రాలేదంటే కచ్చితమైన ఆధారాలతో చిక్కినట్లేనని.. ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నారు.
