Ambati Rambabu : జగన్ యుద్ధానికి శంఖం ఊదితే ఆ సౌండ్‌కే టీడీపీ చచ్చిపోతుంది
అధికారంలో ఉన్నప్పుడు చేయనివి, మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానంటే ఎవరైనా నమ్ముతాడా.? అంటూ చంద్రబాబును(Chandra babu) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rayudu) ప్రశ్నించారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నీ సంగతి తెలియనిది ఎవ్వడికి.? అంటూ ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి(Rajeshkar Reddy) ఫీజు రీయింబర్స్‌మెంట్, జగన్.. అమ్మఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారని.. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తా అన్నావ్, చేశావా.?
అధికారంలో ఉన్నప్పుడు చేయనివి, మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానంటే ఎవరైనా నమ్ముతాడా.? అంటూ చంద్రబాబును(Chandra babu) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ప్రశ్నించారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నీ సంగతి తెలియనిది ఎవ్వడికి.? అంటూ ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి(Rajeshkar Reddy) ఫీజు రీయింబర్స్‌మెంట్, జగన్.. అమ్మఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారని.. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తా అన్నావ్, చేశావా.? అంటూ ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ చేస్తా అన్నావ్ నాకు ఓటేయండి.. అని నమ్మబలికి, నమ్మి ఓటు వేస్తే ఏం చేసావ్.? అని ప్రశ్నించారు. రైతు రుణాల బకాయిలు రూ.87 వేల కోట్ల రూపాయలు తీర్చకపోతే.. బంగారు ఆభరణాలు వేలానికి వస్తే పావలా శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని.. జగన్ వచ్చి 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని తెలిపారు.
ఏం తమ్ముళ్లు అదిరిందా అంటాడు బాబు..! ఆయనకు అదిరింది.. ఎలక్షన్లో ఫ్యాన్ దెబ్బకి.. అదిరిందా అని అడుగుతాడు.. ఆయనకే అనుమానం.. అదిరిందో అదరలేదో.. బాగుందా అని అడుగుతాడు. అనుమానం బాగాలేదని.! అంటూ సైటైర్లు వేశారు. చంద్రబాబు ముసలోడు అంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడికి కోపం వస్తుంది. చంద్రబాబు ముసలోడు కాక.. కుర్రోడా అని ఎద్దేవా చేశారు.
ఐదు సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన చేశారని విమర్శలు గుప్పించారు. జగన్ యుద్దానికి శంఖం ఊదితే ఆ సౌండ్ కి తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుందని అన్నారు. పేదవాళ్ళను ధనవంతులు చేసే స్కీము ఉందంట ఆయన దగ్గర.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే అప్పుడు నీకు తిరుగులేదే.. ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసావా.. ఒక బీసీని పైకి తీసుకొచ్చావా, ఒక ఎస్సీ ని పైకి తీసుకొచ్చావా.. ఒక మైనార్టీని పైకి తీసుకొచ్చావా.. ఒక ఎస్టీని పైకి తీసుకువచ్చా.. ఒక పేదవాడిని పైకి తీసుకొచ్చావా.. నువ్వు, మీ అబ్బాయి, ఈనాడు రామోజీరావు మాత్రమే ధనవంతులయ్యారని అన్నారు. రాధాకృష్ణకు దోచిపెట్టడం, బిఆర్ నాయుడుకు దోచిపెట్టడం, సుజనా చౌదరికి దోచిపెట్టడం తప్ప.. ఎవరిని ధనవంతుడు చేసావ్ అని మండిపడ్డారు.
నిజంగా పనులు చేస్తే.. చాలా వరకు చేశాడు.. కొంత చేయలేకపోయాడు అనుకోవచ్చు.. ఒక్కటి కూడా చేయలేదు.. దుర్మార్గమైన పరిపాలన చేశారని ఫైర్ అయ్యారు. మహానాడు వేదిక మీదకు వచ్చి అది చేస్తా.! ఇచ్చేస్తా.! అని చెప్తున్నారు. ఈ సారి నన్ను గెలిపించండి.. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గొప్ప పరిపాలన చేస్తా అంటున్నారు. ఏముంది అబద్దాలతో అధికారం ఎక్కాక.. రేపు అందరిని మోసం చేయొచ్చనేది చంద్రబాబు ఆలోచన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.