Minister Ambati Rambabu : డ్యాన్స్‌తో అదరగొట్టిన మంత్రి అంబటి రాంబాబు..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేసి సందడి చేసిన వైఎస్సార్‌సీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతేడాది మాదిరిగానే ఉత్సాహంగా కనిపించారు.

Ambati Rambabu Again Dances for Bhogi Celebrations
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranthi) సందడి మొదలైంది. గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేసి సందడి చేసిన వైఎస్సార్‌సీపీ(YSRCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) గతేడాది మాదిరిగానే ఉత్సాహంగా కనిపించారు. భోగి సందర్భంగా సత్తెనపల్లి(Sattenapalle) పట్టణంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన డ్యాన్స్(Dance) చేశారు. జోరుగా, హుషారుగా స్టెప్పులు వేసి ఆకర్షించారు. డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతికి తాను సంబరాల రాంబాబునేనని ఆయన అన్నారు. లేనిపోని రద్దాంతాలను తాను పట్టించుకోబోనని పేర్కొన్నారు. సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా అని ప్రశ్నించగా.. ‘‘ సినిమాల్లో పెట్టుకునే స్థాయిలో నన్ను లేపుతుంటే నేనెందుకు కాదంటాను. నాకేం సమస్యా లేదు. ఇంకో రెండు మూడు పాటలకు డ్యాన్స్ చేస్తానని వ్యాఖ్యానించారు.
గతేడాది సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు సరదాగా చేసిన డ్యాన్స్ రాజకీయంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అంబటి డ్యాన్స్‌ను ఏకంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘బ్రో’ సినిమాలో పేరడీగా తీసుకోవడం.. సోషల్ మీడియా(Social Media)లో ట్రోలింగ్ చేయడం వంటి పరిణామాలను చూశాం.
