Amaravati: అమరావతి రాజధాని పనులు మొదలయ్యేది అప్పటి నుండే!!
తెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు
తెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు మళ్లీ మొదలయ్యాయి. జూన్ 12న ఉద్దండరాయునిపాలెం నుంచి అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. జూన్ 12న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని సీఎస్ తెలిపారు.
సీఆర్‌డీఏ అధికారులతో కలిసి ప్రధాన కార్యదర్శి అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. సగంలో నిలిచిపోయిన వివిధ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి, ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA)ని ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పరిపాలన వికేంద్రీకరణ తెరపైకి తెచ్చింది. మూడు రాజధానుల ప్రణాళికను రూపొందించింది. దీంతో అమరావతి పనులు పెండింగ్ పడ్డాయి.