Best Capital for Andhra Pradesh : ఏపీకి రాజధానిగా ఏది బెస్ట్.. AI 'గ్రోక్' గాడు ఏం చెప్పాడంటే..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై గత పదేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై గత పదేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. 2014లో చంద్రబాబు(CM Chandrababu) ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి(Amaravati)ని రాజధానిగా ఎంపిక చేసి రైతుల నుంచి దాదాపు 30 వేల ఎకరాలు సేకరించారు. ఆయన ప్రభుత్వంలో కొన్ని కట్టడాలు కూడా జరిగాయి. ఆ తర్వాత జగన్(Ys jagan) వచ్చి మూడు రాజధానులు అన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మళ్లీ అమరావతినే రాజధాని(Amaravati Capital)గా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఇదే విషయంపై ఎక్స్‌లో గ్రోక్(Grok)ను కూడా ప్రశ్నిస్తే..ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతియే తెలివైన ఎంపిక అని తెలిపింది. మరింత వివరిస్తూ అమరావతి మధ్యస్థంగా ఉందని .. అధిక వ్యయం రూ. 64,721 కోట్లు ఉన్నప్పటికీ సామాజికంగా అందరినీ కలుపుకొని పోయేదిగా ఉందని గ్రోక్ పేర్కొంది. విశాఖపట్నం(Vizag) ఏపీకి ఉత్తరాన ఉండడం ఒక ప్రాంతానికి అనుకూలంగా ఉండవచ్చు. అమరావతి చారిత్రక ప్రాముఖ్యత సాంస్కృతిక వారసత్వంగా ఉంటుంది." అని గ్రోక్ స్పష్టం చేసింది. తద్వారా ఒక ఖచ్చితమైన విశ్లేషణతో ఈ చర్చకు ముగింపు పలికింది.
