Amaravati JAC Balakotaiah : ఆర్ఆర్ఆర్ కు అండగా ఉంటాం....బహుజన ఐకాస బాల కోటయ్య హామీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP POlitics) ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తు పుణ్యమా అని కొందరికి టికెట్లు దొరకడం లేదు. సీట్ల కేటాయింపులు గందరగోళంగా తయారయ్యాయి. అదే సమయంలో టికెట్ దొరకని అభ్యర్థులలో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి. కొందరు తమ అసంతృప్తిని బాహాటంగా చాటుకుంటే, కొందరు లోలోపల కుమిలిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP POlitics) ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తు పుణ్యమా అని కొందరికి టికెట్లు దొరకడం లేదు. సీట్ల కేటాయింపులు గందరగోళంగా తయారయ్యాయి. అదే సమయంలో టికెట్ దొరకని అభ్యర్థులలో నిరాశా నిస్పృహలు అలుముకుంటున్నాయి. కొందరు తమ అసంతృప్తిని బాహాటంగా చాటుకుంటే, కొందరు లోలోపల కుమిలిపోతున్నారు. ధైర్యం ఉన్నవారు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడనికి సిద్ధమవుతున్నారు. నర్సాపురం లోక్‌సభ(Narasapuram lok Sabha) సభ్యుడు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju)కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య(Pothula Balakotaiah) అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఆయనకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని చెప్పారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పాలనా విధానాలపై అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక నాయకుడు రఘురామకృష్ణరాజేనని చెప్పారు. ఆయనకు లోక్‌సభ టికెట్ ఇవ్వడానికి కూటమిలోని మూడు పార్టీలకు ఎందుక చేతులు రావడంలేదో చెప్పాలన్నారు.
దేశాల సరిహద్దులు దాటిన వారికి, నియోజకవర్గాల ఎల్లలు తెలియని వారికి, ఇంట్లో మూలన కూర్చుని నిద్ర పోతున్న రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ అధికారులను నిద్ర లేపి, వారికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇస్తున్నారని బాలకోటయ్య విమర్శించారు. రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవటాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రేపటి ఎన్నికలలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా, కదనరంగాన సింహంలా దూకాలని కోరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బహుజన ఐకాస చాలా బలంగా అండగా ఉంటామని చెప్పారు. అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలి అని నినదిస్తే, పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు మృత్యు ముఖంలో తలపెట్టి వచ్చిన రాజును కాదంటే, ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. కూటమిలోని మూడు పార్టీలు సమీక్షించుకొని రఘురామకృష్ణరాజు కు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు బాలకోటయ్య.