Nara Lokesh : నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్
ఇవాళ సీఐడీ విచారణకు నారా లోకేష్ హాజరుకానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ విచారణకు హాజరవనున్నారు. లోకేష్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో

Amaravati Inner Ring Road Case Nara Lokesh For CID Investigation Today
ఇవాళ సీఐడీ(CID) విచారణకు నారా లోకేష్(Nara Lokesh) హాజరుకానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Amaravati Inner Ring Road Case) స్కాం(Scam)లో లోకేష్ విచారణకు హాజరవనున్నారు. లోకేష్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో A - 14గా చేర్చారు సీఐడీ అధికారులు. హైకోర్టు(High Court) ఆదేశాలతో కుంచనపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం -2 ఆఫీస్ కు లోకేష్ రానున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే లోకేష్‌ను విచారణ చేయాలని హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించారు. మధ్యలో గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సూచించింది. లోకేష్ న్యాయవాదిని కూడా విచారణకు అనుమతించాలని కోర్టు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో హెరిటేజ్(Heritage) కు లాభం చేకూరేలా చేసారని సీఐడీ ఆరోపించింది.
