ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(amaravathi) వరదలో(Floods) చిక్కుకున్నదన్నది నూటికి నూరు శాతం నిజం!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(amaravathi) వరదలో(Floods) చిక్కుకున్నదన్నది నూటికి నూరు శాతం నిజం! ఇది బాధాకరమైన విషయమే! కానీ వాస్తవాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించడం మరింత బాధాకరం! అమరావతిలోకి నీళ్లు వచ్చాయన్నది అబద్ధమని, విపక్షాలు ఉద్దేశపూర్వకంగా బుదర చల్లుతున్నాయని టీడీపీ(TDP) నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతూ వచ్చింది. వరద లేనే లేదన్నట్టుగా పాత ఫోటోలు చూపించి జనాలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు(chandrababu) కూడా అమరావతిలో చుక్క నీరు రాలేదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశమన్నారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరే రాలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇలా చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగానే అమరావతికి వరద నీరు వచ్చిందని ఒప్పుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక లేఖ కూడా రాసింది. మూడు రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో వణికిపోతున్నారు. అమరావతిని వరద ముంచెత్తుతుండటంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తారు. ముప్పును గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు, ఉద్యోగులు హుటాహుటిన సచివాలయాన్ని వీడి విజయవాడ, గుంటూరుకు తరలివచ్చేశారు. సచివాలయానికి తాత్కాలికంగా తాళాలు వేశారు. ఎమ్మెల్యే క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు, పలు ప్రభుత్వ భవనాల దగ్గర వరద నీరు ఇంకా నిలిచే ఉంది. ఇంతకు ముందంటే టీడీపీ అనుకూల మీడియా అబద్దాలు చెప్పినా జనం నిజమేకాబోలనుకుని నమ్మేసేవారు. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా రాకతో నిజమేమిటో ప్రజలకు తెలిసి వస్తున్నది. అమరావతిలోకి వరద నీరు రావాలని ఎవరూ కోరుకోరు. ప్రజలు ఇబ్బంది పడాలనే మెంటాలిటీ ఎవరికీ లేదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయమెందుకు? అని జనం అనుకుంటున్నారు.