అల్లు అర్జున్‌(Allu Arjun) వ్యవహారశైలి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) కోపం తెప్పిస్తోంది. తమ బాస్‌ పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గానికి ప్రచారానికి రాకుండా నంద్యాలకు(Nandhyala) వెళ్లడమేమిటని పవన్‌ ఫ్యాన్స్‌ కూడా మండిపడుతున్నారు. మొన్నేదో పవన్‌కు విషెస్‌ చెబుతూ చిన్న ట్వీట్ చేశారంతే! అంతకు మించి వపన్‌ కోసం బన్నీ ఏం చేయలేదిప్పటి వరకు! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంటే పవన్‌కు అరికాలి మంట నషాళానికెక్కుతుంది.

అల్లు అర్జున్‌(Allu Arjun) వ్యవహారశైలి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) కోపం తెప్పిస్తోంది. తమ బాస్‌ పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గానికి ప్రచారానికి రాకుండా నంద్యాలకు(Nandhyala) వెళ్లడమేమిటని పవన్‌ ఫ్యాన్స్‌ కూడా మండిపడుతున్నారు. మొన్నేదో పవన్‌కు విషెస్‌ చెబుతూ చిన్న ట్వీట్ చేశారంతే! అంతకు మించి వపన్‌ కోసం బన్నీ ఏం చేయలేదిప్పటి వరకు! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంటే పవన్‌కు అరికాలి మంట నషాళానికెక్కుతుంది. జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని పవన్‌ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళనతోనే టీడీపీ(TDP), బీజేపీలతో(BJP) చేతులు కలిపారు పవన్‌. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్‌ విజయం కోసం చెమటోడుస్తున్నారు. జబర్దర్‌ టీమ్‌ అంతా పిఠాపురంలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరు తప్ప ఎవరూ పిఠాపురానికి వెళ్లలేదు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన తమ్ముడికి ఓటు వేయండి అంటూ ఓ వీడియో చేసి వదిలారే తప్ప పిఠాపురానికి వెళ్లలేదు. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్‌ తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి(shilpa Ravichandra Reddy) ఇంటికి వెళ్లారు. తన భార్య స్నేహారెడ్డితో(Sneha Reddy) కలిసి ఆయన నంద్యాలకు వెళ్లారు. తన ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ దంపతులకు శిల్పా రవి దంపతులకు ఘన స్వాగతం పలికారు శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు. అల్లు అర్జున్‌ రాక గురించి తెలుసుకుని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నంద్యాలకు చేరుకున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటి దగ్గర ఫ్యాన్స్‌ సందడి చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్‌ తన భార్యతో కలిసి వెళ్లడం పవన్‌కు కోపం తెప్పించకుండా ఉంటుందా? ర‌వి ఇంటికి వెళ్ల‌డం ద్వారా, త‌న అభిమానుల‌కు రాజ‌కీయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే సంకేతాలు పంపార‌ని అనుకుంటున్నారు. క్రితం సారి జరిగిన ఎన్నిక‌ల్లో కూడా శిల్పా ర‌విచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి మ‌ద్ద‌తు ప‌లికారు.

Updated On 11 May 2024 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story