తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డికి ప్రచారం చేయడం కోసం

తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డికి ప్రచారం చేయడం కోసం అల్లు అర్జున్ నంద్యాలకు చేరుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా నంద్యాలకు వచ్చారు. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించారు. అయితే, శిల్పా రవిచంద్రారెడ్డితో బన్నీకి మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన నంద్యాలకు వచ్చారు. స్నేహారెడ్డి, రవిచంద్రారెడ్డి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో అల్లు అర్జున్ ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు.

అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ శిల్పా రవి నాకు మంచి మిత్రుడని తెలిపారు. తనకు పార్టీలతో సంబంధం లేదని.. కేవలం వ్యక్తిగత స్నేహంతోనే నేను నంద్యాలకు రావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి వద్దన్నా కూడా నేనే తనకు విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చానన్నారు. అతనితో నాకూ.. నా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంద్యాలకు వచ్చేలా చేసిందని అన్నారు. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అల్లు అర్జున్.

Updated On 11 May 2024 4:11 AM GMT
Yagnik

Yagnik

Next Story