మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి సొంత‌గూటికి చేరారు. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న వపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంత‌రం ఆర్కే మాట్లాడుతూ..

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి సొంత‌గూటికి చేరారు. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న వపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంత‌రం ఆర్కే మాట్లాడుతూ.. వైసీపీ తనకు అన్ని రకాల అండగా ఉందన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గం నుంచేన‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చానన్నారు. 2019లో ఏ విధంగా ఓ ఓసి వర్గం చేతిలో ఓటమి చెందాడో.. అదే విధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యమ‌న్నారు.

రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చిందని ఆర్కే విచారం వ్య‌క్తం చేశారు. పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నమ‌న్నారు. విపక్షాల ప్రయత్నం ఫలించకూడదనే తిరిగి వైసీపీలో చేరానన్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ బరిలో నిలబెట్టిన గెలిపిస్తాన‌న్నారు. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం అని జోష్యం చెప్పారు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఏవరనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు.

Updated On 20 Feb 2024 7:48 AM GMT
Yagnik

Yagnik

Next Story