సీఎం వైఎస్ జగన్ కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలను అందజేశారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

సీఎం వైఎస్ జగన్ కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలను అందజేశారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. లబ్ధి చేకూరితోనే తనకు ఓటు వేయమని అనే ధైర్యం ఒక్క జగన్‌కే ఉందని, జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు. నారా లోకేష్ ఎన్నో మాయ మాటలతో, డబ్బు సంచులతో మన ముందుకు వస్తాడని.. ఆ మాయమాటలను నమ్మవద్దని సూచించారు.

నారా లోకేష్ 5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడని.. ఇలాంటి మాయమాటలు చెప్పే బదులు.. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంట్లో కూర్చొని మంగళగిరి.. మంగళగిరి.. మంగళగిరి.. అని కాంపొజిషన్ రాసి మంగళగిరి అని పలకటం కరెక్ట్ గా నేర్చుకొని ఎన్నికల ప్రచారానికి వస్తే బాగుంటుందని అన్నారు. మంగళగిరి ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు 20వేల ఇల్లులు నిర్మించి ఇస్తానని బూటకపు మాటలు లోకేష్ చెప్తున్నాడని.. ముందు అక్రమంగా ఉంటున్న ఇంటిలో ఉండకుండా లోకేష్ సక్రమమైన సొంత ఇల్లు కట్టుకోవాలని సూచించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో డొంక రోడ్లు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ డ్రైన్లు నిర్మించింద‌ని.. అలాగే కార్పొరేషన్ పరిధిలో 9 అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు ఉందని.. గతంలో మూడు శాఖల మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరికి ఒక్క పని కూడా చేయకుండా.. ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సైన్యంగా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుడు లావణ్యని, ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated On 21 March 2024 10:24 PM GMT
Yagnik

Yagnik

Next Story