AKilesh yadav : జగన్ ఏవైపో చెప్పేసిన ధర్నా
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) సమాజ్‌వాదీ పార్టీ(SWP) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(Akilesh yadav) మద్దతు పలికారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) సమాజ్‌వాదీ పార్టీ(SWP) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(Akilesh yadav) మద్దతు పలికారు. ఢిల్లీలోని(Delhi) జంతర్‌మంతర్‌లో(Jantar Mantar) జగన్ చేస్తున్న ధర్నాకు విపక్షాలకు చెందిన నాయకులు మద్దతుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ(TDP) అరాచక పాలన సాగుతోందని, వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆరోపిస్తూ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ పలు వీడియోలు, ఫొటోలను అఖిలేశ్‌కు చూపించారు జగన్. ఏపీలో ఏం జరుగుతున్నదో పూసగుచ్చినట్టు వివరించారు. ప్రజాస్వామ్యంలో బుల్‌డోజర్ సంస్కృతి మంచిది కాదన్నారు అఖిలేశ్. విపక్షాలపై పాలకపక్షాలు దాడులు చేయడం మంచిది కాదన్నారు. యూపీలో కూడా బుల్‌డోజర్ పాలన సాగుతోందని మండిపడ్డారు. తాము బుల్‌డోజర్ సంస్కృతికి వ్యతిరేకమన్నారు. ఇదిలా ఉంటే జగన్ ధర్నాకు అఖిలేశ్ మద్దతు ఇవ్వడం ఆసక్తికర పరిణామం. మొన్నటి ఎన్నికలలో ఎన్టీయే కూటమికి, ఇండియా కూటమికి సమాన దూరం పాటించారు జగన్. జగన్ ధర్నాకు వచ్చిన విపక్ష నేతలను గమనిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా నెమ్మదిగా ఇండియా కూటమికి దగ్గరవుతుందనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదు. జగన్ బీజేపీకి వ్యతిరేకమని ఆయన చేపట్టిన ధర్నా పరోక్షంగా తెలిపింది.