Pawan kalyan : పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) భద్రతకు ముప్పు ఉందని సోషల్ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) భద్రతకు ముప్పు ఉందని సోషల్ మీడియాలో(Social media) వార్తలు వస్తున్నాయి. పవన్‌ను హత్య(Murder) చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఇదే విషయమైన కేంద్రం నిఘా వర్గాలు ఆయనను హెచ్చరించినట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జాగ్రత్తగా ఉండాలని పవన్‌కు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చిరంచినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించ లేం కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. రెగ్యులర్ ట్రాకింగ్ చేస్తుండగా కొన్ని గ్రూపుల్లో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు నిఘావర్గాలు గుర్తించాయి.
అప్రమత్తమైన కేంద్ర నిఘావర్గాలు నేరుగా పవన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు పవన్‌ను ఎవరు టార్గెట్ చేశారు, రాజకీయ ప్రత్యర్థులు పవన్‌ను మట్టుబెట్టాలని చూస్తున్నాయా లేదా వ్యక్తిగత కారణాలేవైనా ఉన్నయా అన్న కోణంలోనూ చర్చిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబును చేర్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతేకాదు కేంద్రంలో మోడీ అధికారంలో ఉందంటే నితీష్, చంద్రబాబు మద్దతు తప్పనిసరి. చంద్రబాబుతో కూటమి ఏర్పడేందుకు పవన్ విశ్వప్రయత్నాలు చేశారని, దాదాపు పవన్ వల్లే కేంద్రంలో అధికారంలో బీజేపీ చేతుల్లో ఉందని, అటు మోడీ ప్రత్యర్థులు కూడా పవన్‌ను ఏమైనా టార్గెట్ చేశారా అన్న కోణంలోనూ కారణాలు అన్వేషిస్తున్నారట. పైగా పవన్ కల్యాణ్ హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను, ఆచారాలపట్ల ఆయనకు ఎనలేని విశ్వాసం ఉన్నందున హిందూ వ్యతిరేక శక్తులు కూడా పవన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. పవన్ భద్రతకు ముప్పు అంటూ వస్తున్న వార్తలు అయితే ఇప్పుడు పెనుదుమారాన్నే లేపుతున్నాయి.