Egg Price: 2 నెలల తర్వాత దిగొస్తున్న కోడి గుడ్డు ధర..!
గత రెండు నెలలుగా కోడి గుడ్డుధరలు(Egg Price) భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో(Hyderabad) డజన్ గుడ్డు ధర రూ.84కు చేరింది. ఒక్కో గుడ్డు ధర రూ.7కు చేరింది. కోళ్ల దాణా పెరగడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, రవాణా ఖర్చుల భారంతో గత రెండు నెలల నుంచి కోడిగుడ్డు ధరలు పెరుగుతూ వచ్చాయి.

egg-compressed
గత రెండు నెలలుగా కోడి గుడ్డుధరలు(Egg Price) భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో(Hyderabad) డజన్ గుడ్డు ధర రూ.84కు చేరింది. ఒక్కో గుడ్డు ధర రూ.7కు చేరింది. కోళ్ల దాణా పెరగడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, రవాణా ఖర్చుల భారంతో గత రెండు నెలల నుంచి కోడిగుడ్డు ధరలు పెరుగుతూ వచ్చాయి. గతంలో కిలో ఫీడ్ ధర రూ.17 ఉండగా అది రూ.28కి పెరిగింది. రెండు నెలలుగా చికెన్, కోడి గుడ్లు ధరలు పెరిగినా చికెన్ ధరలు తగ్గాయి కానీ కోడి గుడ్డు ధర మాత్రం పెరుగుతూనే ఉంది. . అయితే ఈరోజు కోడి గుడ్ల ధరలు తగ్గాయి. ఏపీలో కోడి గుడ్డు ధర రూ.5.80 పైసలు ఉండగా, డజన్ కోడి గుడ్ల ధర రూ.69కి తగ్గింది. తెలంగాణలో హోల్‌సేల్ గుడ్డు ధర రూ.5.50కు తగ్గగా, డజన్ కోడిగుడ్లు రూ.66కు తగ్గింది. సంక్రాంతి పండగ సందర్భంగా కోడి గుడ్ల ధరలు తగ్గడంతో గుడ్డు ప్రియులకు కాస్త ఉపశమనం కలగనుంది.
