ఏసీబీ కోర్టు(ACB Court)లో రెండవరోజు చంద్రబాబు(Chandrababu) తరుపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే(Pramod Kumar Dubey) వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scam)తో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టులొ వాద‌న‌లు వినిపించారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో చంద్ర‌బాబును కేసులో ఇరికించారని..

ఏసీబీ కోర్టు(ACB Court)లో రెండవరోజు చంద్రబాబు(Chandrababu) తరుపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే(Pramod Kumar Dubey) వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scam)తో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టులొ వాద‌న‌లు వినిపించారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో చంద్ర‌బాబును కేసులో ఇరికించారని.. డిజైన్ టెక్(Design Tech )సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని.. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కు నిధులు మాత్రమే మంజూరు చేశారని.. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంట‌ర్ల ద్వారా రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని.. అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది.. చంద్రబాబు పాత్ర ఏముందని వాద‌న‌లు వినిపించారు. ఇది పూర్తి గా రాజకీయ కక్ష తో పెట్టిన కేసు.. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీ లో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు.. అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటీషన్ వేశారని.. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని న్యాయ‌మూర్తిని కోరారు.

Updated On 5 Oct 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story