తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) అరెస్టయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌(skill Development) కార్పొరేషన్‌ల వందల కోట్ల రూపాయల ఆర్ధిక అవకతవకలు జరిగాయన్న కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. చంద్రబాబు తరఫున ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సిద్ధార్థ్‌ లూథ్రా(Siddharth Luthra) వాదించారు.

తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) అరెస్టయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌(skill Development) కార్పొరేషన్‌ల వందల కోట్ల రూపాయల ఆర్ధిక అవకతవకలు జరిగాయన్న కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. చంద్రబాబు తరఫున ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సిద్ధార్థ్‌ లూథ్రా(Siddharth Luthra) వాదించారు. లూథ్రా వాదిస్తున్నారని తెలిసిన చాలా మంది ఇంకేముంది చంద్రబాబు సునాయాసంగా బయటకు వచ్చేస్తారని అనుకున్నారు. కానీ సీఐడీ(CID) తరఫున ఏసీబీ కోర్టులో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Sudhakar Reddy) బలమైన వాదనలు వినిపించారు. లూథ్రాకే చుక్కలు చూపించారు. సుధాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లా కనుమర్తి పాడు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి వేణుగోపాల్‌రెడ్డి వ్యవసాయంతో పాటు మైకా వ్యాపారం చేసేవారు. ఓ రకంగా సుధాకర్‌రెడ్డి గోల్డెన్‌ స్పూన్‌తో జన్మించారని అనుకోవచ్చు. మైకాను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేది సుధాకర్‌రెడ్డి కుటుంబం. సుధాకర్‌రెడ్డి పుట్టి పెరిగిన ఊళ్లో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. సుధాకర్‌రెడ్డి తాతలు ఫ్యాక్షన్‌(factionism) కారణంగానే కన్నుమూశారు. ప్రత్యర్థి వర్గానికి సుధాకర్‌రెడ్డి కుటుంబం కూడా అదే రీతిలో సమాధానం చెప్పిందనుకోండి.. చిన్నప్పట్నుంచి ఫ్యాక్షన్‌ వాతావరణంలో పెరగడం వల్ల పోలీసు కేసులు, కోర్టు కేసులు వంటి అంశాలపై సుధాకర్‌రెడ్డికి ఆసక్తి పెరిగింది. చదివితే న్యాయశాస్త్రమే చదవాలని అప్పుడే డిసైడయ్యారు. చిన్నప్పుడే న్యాయవ్యవస్థపై అవగాహన పెంచుకున్న సుధాకర్‌రెడ్డి లా కోర్సు పూర్తి చేసి ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. సుధాకర్‌రెడ్డి అన్న మధూసూదన్‌ రెడ్డి కూడా అడ్వొకేటే! మొదట్లో ఇద్దరూ కలిసి ప్రాక్టీస్‌ చేసేవారు. లా చదువుతున్నప్పుడే న్యాయవృత్తి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అన్నతో కలిసి నెల్లూరు కోర్టులో ఎన్నో కీలకమైన కేసులను వాదించారు సుధాకర్‌. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసే కాదు, చంద్రబాబు ఓటుకు నోటు కేసు, పరిటాల శ్రీరామ్‌ హత్యాయత్నం కేసు. అమరావతి భూముల కుంభకోణం కేసు, వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు వంటి ఎన్నో కేసులలో తన వాక్పటిమను ప్రదర్శించారు సుధాకర్‌రెడ్డి. ఆయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి అభిమాని. ఓ సాధారణ అడ్వొకేట్‌గా ఉన్న తనను అడిషనల్‌ అడ్వొకేట్‌గా నియమించిన జగన్‌కు జన్మాంతం రుణపడి ఉన్నానని సుధాకర్‌రెడ్డి అంటుంటారు. తండ్రి జన్మనిస్తే, జగన్‌ పునర్జన్మ ఇచ్చారని చెబుతుంటారు.

Updated On 12 Sep 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story