SC and ST Classification:ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై, క్రిమిలేయర్‌పై మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ (Jada Sravan)సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై, క్రిమిలేయర్‌పై మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ (Jada Sravan)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీల(SC,ST)కు క్రిమిలేయర్ వర్తించనే వర్తించదని గట్టిగా చెప్పారు. ఆర్టికల్ 341, ఆర్టికల్ 342లు ఏం చెబుతున్నాయో జడ శ్రవణ్ వివరించారు. ఆయన ఏమన్నారంటే 'రాజ్యాధికారాన్ని కోరుకుంటున్న రెండు వర్గాలు, రాజ్యాధికారంలోకి రాగాలిన రెండు కమ్యూనిటీలు, ఏదో ఒక రోజు అంబేద్కర్(Ambedkar)కల సాకారం అవుతుందనే ఆశతోచ అన్నదమ్ముల్లా ఇంతకాలం కలసి మెలసి ఉన్న ఆ వర్గాలు ఇప్పుడు విచ్చిన్నమవుతాయేమోనన్న బాధ కలుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు. వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీల వర్గాలకు క్రిమిలేయర్ కాంపెస్ట్ అప్లికబుల్ కాదు. ఓ వ్యక్తి రిజర్వేషన్‌తో ఉన్నత ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థితికి చేరుకుంటాడనుకుందాం! ఆ తర్వాత అతడి కుటుంబానికి రిజర్వేషన్ ఉండదు. క్రిమిలేయర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది! రిజర్వేషన్‌తో ఐఎఎస్(IAS) అయిన వ్యక్తి కుమారుడికి రిజర్వేషన్ అవసరమా? ఆర్ధికంగా ఎదిగిన తర్వాత కూడా రిజర్వేషన్లు ఎందుకు? వాటిని తీసేయాలని క్రిమిలేయర్ చెబుతున్నది. ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది వారి ఆర్ధిక స్థోమతలను దృష్టిలో పెట్టుకుని కాదు! వారి పట్ల వివక్ష చూపుతున్నందుకు. సమాజం వారిని దూరంగా పెట్టినందుకు. వారి పట్ల చిన్నచూపు చూస్తున్నందుకు. సమాజం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటం.. అస్పృశ్యులుగా చూస్తుండటం. ఈ కారణాల వల్లే వారికి రిజర్వేషన్లు కల్పించింది భారత రాజ్యాంగం. ఉన్నత హోదాలో ఉన్నవారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. కులం పేరుతో అవహేళను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ స్థాయికి వెళ్లినా కులం వెంటాడుతున్నప్పుడు క్రిమిలేయర్ ఎలా వర్తిస్తుంది? క్రిమిలేయర్ ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు వర్తించనే వర్తించదు' అని జడ శ్రవణ్ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.