తిరుమల లడ్డూ వివాదంపై జైభీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుమల లడ్డూ వివాదంపై జైభీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandra Babu Naidu) లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపించారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కల్తీ జరిగిందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేదని జడ శ్రవణ్‌(Jada Sravan Kumar) అన్నారు. జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఆడిన రాజకీయ డ్రామాగా లడ్డూ వివాదాన్ని అభివర్ణించారు జడ శ్రవణ్‌. తిరుమలలో రాజకీయాలకు తావు ఉండకూడదని, తిరుమల క్షేత్రం ప్రక్షాళనకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కోటాను కోట్ల శ్రీవారి భక్తులు తిరుమల ప్రక్షాళన కోసం డిమాండ్‌ చేయాలని పిలుపిచ్చారు. వెంకటేశ్వరుడి సన్నిధిలో రాజకీయాలేమిటని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్‌(ttdchairman) పదవిని కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తికి ఇవ్వాలని జడ శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇవ్వలేకపోయాం కదా అని చెప్పి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలనుకుంటారని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు. అలాగే ఓ న్యూస్‌ ఛానెల్ అధినేత పేరు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరు కూడా వినిపిస్తున్నాయని, ఇలాంటివారిని తీసుకొచ్చి టీటీడీ ఛైర్మన్‌ పదవిలో కూర్చొబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి స్వప్తి పలకాల్సిన సమయం ఇదని జడ శ్రవణ్‌ అన్నారు. తాము రమణ(NV Ramana)కు టికెట్ ఇవ్వలేకపోయామేనని చెప్పి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. అలాగే తమకు అనుకూలవార్తలు ప్రసారం చేస్తున్నందుకు మీడియా అధినేతను తీసుకొచ్చి తిరుమలలో కూర్చోబెట్టడం సరైంది కాదన్నారు జడ శ్రవణ్‌. ఏబీఎన్‌ రాధాకృష్ణ(ABn Radha krishna) చెప్పినవాడికో, భువనేశ్వరికి వైద్యం చేసిన డాక్టర్‌కో, నారా బ్రాహ్మణి ఫ్రెండ్‌కో, లేదా పార్టీ కోసం వందకోట్లో, రెండొందల కోట్లో ఇచ్చిన వారికో పాలకమండలి సభ్యులుగా నియమించినా తప్పే అవుతుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాసంగా మారకూడదని చెప్పారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని తిరుమలకు దూరంగా ఉండాలని తెలిపారు.

ehatv

ehatv

Next Story